అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం
ఎల్బీ నగర్( జనం సాక్షి ) సెప్టెంబర్ 17న విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కోరారు .బుధవారం నాడు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం , గౌరవ అధ్యక్షులు తల్లోజు చెన్నయా చారి, కోశాధికారి ఆవంచ మురళిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల పైగా విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ ) లు ఉన్నారని అన్నారు .ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మార్గదర్శకుడైన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ,మారోజు వీరన్న ,మళ్ళీ దశ తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు .శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడువిష్ణు మాసం పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా రాజస్థాన్’ హర్యానా ,పంజాబ్, త్రిపుర , పశ్చిమ బెంగాల్ ఒరిస్సా జార్ఖండ్ బిహార్ కర్నాటక , వంటి రాష్ర్టాల్లో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఆ ప్రభుత్వలెెే అధికారికంగా నిర్వహిస్తు అదే రోజున పండుగా సెలవుగా జరుపుకుంటున్నాయని అన్నారు . తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు . . తెలంగాణ ప్రభుత్వమే యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజంలోనూ నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించాలని తెరాస ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .




