50వ రోజుకు చేరిన ఉచిత అల్పాహార పంపిణీ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం బుధవారం నాటికి 50వ రోజుకు చేరుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అన్నారు.మరో అతిథిగా హాజరైన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి కృపాకర్ ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమానికి తనవంతుగా రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ చంద్ర , రీజియన్ చైర్మన్ చిలుముల శ్రీనివాసరెడ్డి , జోన్ చైర్మన్ మర్రు హనుమంతరావుతో సీనియర్ సభ్యులు ఉప్పల రాజేంద్రప్రసాద్, కమలేకర్ శంకర్ లాల్, సవరాల సత్యనారాయణ , బండారు రాజా, బైరు వెంకన్న గౌడ్, రాచకొండ శ్రీను , రఫీ , పోలేబోయిన నర్సయ్య యాదవ్, యామ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.