సెప్టెంబర్ 17 కు నిజమైన వారసులు కమ్యూనిస్టు లే
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.రాంచందర్.
జహీరాబాద్ సెప్టెంబర్ 14( జనంసాక్షి)-తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ కార్యక్రమని పురస్కరించుకుని బుధవారం జహీరాబాద్ పట్టణం లో బైక్ ర్యాలీ పశువుల మార్కెట్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు తీయడం జరిగింది. ఈ సందర్భంగా బి.రాంచందర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతాన్ని నిజమ్ నవాబు నుండి,దొరలు,జాగీర్దార్, జమిన్ దర్ భూ స్వాములు నుండి ప్రజలను రక్షించడానికి విరోచితమైన పోరాటం చేసిన చరిత్ర ఒక్క కమ్మునిస్టులకు తప్ప మరో కరికి లేదని అన్నారు. ప్రజలను సమీకరించి 3 వేల గ్రామాలలో గ్రామ స్వరాజం ఏర్పాటు చేసిన చరిత్ర, 4 వేల మంది కామ్రేడ్స్ యొక్క విలువైన ప్రాణాలు త్యాగాలు చేసిన చరిత్ర ఒక కమ్మునిస్టులకు తప్ప మారొకరికి లేదని అన్నారు.
బీజేపీ పోరాటాని హిందు,ముస్లిం, పొరటంగా చూయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకంటే దిగజారుడు ఏముంటుందని అన్నారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ వారు ఎవరు పాల్గొన్నారు, ఎంత మంది ప్రణాలు బలిదానం అయ్యారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసినారు. చక్కలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య,దొడ్డి కోమరయ్య, పోరాట స్పోర్తితో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిపాల్,నర్సయ్య,చంద్రన్న,సలిమో ద్దీన్,కనకరెడ్డి,దక్షణ మూర్తి,సలిమోద్దీన్,ముజాయత్, నర్సింలు,ప్రభాకర్,శంకర్,ప్రభా కర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area