సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుతాం.. బిజెపి

బచ్చన్నపేట సెప్టెంబర్ 17 (జనం సాక్షి) సెప్టెంబర్ 17 ను తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినంగా జరుపుతామని బిజెపి మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు సద్ది సోమిరెడ్డి. పోతుల వెంకటేష్ లు అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం వారు మాట్లాడుతూ. తెలంగాణకు స్వాతంత్రం రావడానికి కొన్ని వేల మంది అమరుల త్యాగమే తెలంగాణ విమోచన దినమని కానీ కొంతమంది స్వార్థపరులు చరిత్రను వక్రీకరించి కనుమరుగు చేయాలని చూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం తో కలిసి చరిత్రను మారువాలని చూస్తున్నారని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జూకటి గణేష్. ఉపాధ్యక్షులు పిండం నగేష్. చిమ్ముల నరేందర్. మేకల వెంకటేష్. గద్దరాజు. చంద్రమౌళి. రాంబాబు రాజు తదితరులు పాల్గొన్నారు