సెలవుల అనంతరం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): బతుకమ్మ , దసరా వంటి పండుగల వేళా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడమంటే ఆడకూతుళ్ల సంతోషంను హరించిన వారవుతారని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు గుంటి సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జూమ్ మీటింగ్ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తే , వారు కుటుంబ సభ్యుల మధ్య గడుపు సమయం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జూమ్ మీటింగ్ ను సెలవుల తర్వాతే నిర్వహించాలని కోరారు.