Friday, 6 November 2026

సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహ్యత 

హైదరాబాద్‌,మే17(జ‌నం సాక్షి ):  నగరంలో ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయికుమార్‌గౌడ్‌(21) అనే యువకుడు గత రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఘట్‌కేసర్‌ మండలం అన్నోజి గూడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు రిలయన్స్‌లో మార్కేట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.