సెస్ విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

వేములవాడ గ్రామీణం, ఆగస్టు 22 (జనంసాక్షి): సెస్ విద్యుత్ విని యోగుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ‘విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక’ను సెస్ ఎండి రామకృష్ణ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు సెస్ రూరల్ ఏ.ఈ నగేష్ తెలిపారు. బోయిన్ పల్లి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని వేములవాడ టౌన్, రూరల్, కోనరావుపేట, చందుర్తి, బోయిన్ పల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ వినియోదారుల సమస్యల పరిష్కార వేదిక-2 (సి జి అర్ ఫ్ -2)నిజామాబాద్ చైర్ పర్సన్ ఈశ్వరయ్య హాజరవుతారని పేర్కొన్నారు.