Wednesday, 4 November 2026

సేవకు ప్రతిరూపం వీణవంక ముద్దు బిడ్డ  సీఈఓ  పాడి ఉదయ్ నందన్ రెడ్డి

 వీణవంక మార్చి 6 ( జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని పేద ప్రజల కుటుంభాలకు కష్టం  ఉందంటే   నేనున్నానంటూ తన అభయహస్తాన్ని అందిస్తు  పేదవాళ్లకు దైవంగా  నిలుస్తున్నారు వీణవంక  ముద్దుబిడ్డ  యఫ్ టివి సీఈఓ  పాడి ఉదయ్ నందన్ రెడ్డి.   మండల కేంద్రంతో పాటు నియోజవర్గంలోని   ఆయా గ్రామాలలో నా పేద ప్రజలకు  ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా  వారికి నేనున్నానంటూ   ముందుండి  పేద ప్రజలకు వారికి తోచిన కాడికి సహాయ సహకారాలు అందిస్తు  ప్రజలందరి మన్ననలు పోందుతున్నారు.  ఇటీవల మండల కేంద్రంలో అనారోగ్యంగా   మృతి చెందిన గెల్లు కనకయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం తోపాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వీణవంక  మండల కేంద్రానికి చెందిన ముద్దుబిడ్డ  పాడి ఉదయ్ నందన్ రెడ్డి. నేను ఉన్నానంటూ ముందుకు వెళ్తున్నారు కరోనా సమయంలో మండల కేంద్రంలో తోపాటు నియోజవర్గం పేద ప్రజలకు సుమారు 50 లక్షల రూపాయల నిత్యవసర వస్తువులు  పేద వారికి తన వంతుగా సాయం చేసుకుంటూ  సహాయ సహకారాలు అందించుకుంటూ  గత కొన్ని సంవత్సరాలు తరబడి   ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు  సహాయ సహకారాలు అందజేస్తూ   ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ ముందుకు కొనసాగుతూ  ముందుండి పేద  వారిని కాపాడుకుంటున్నారు   . ఈ కార్యక్రమం మండల కో ఆప్షన్ మెంబర్  అబ్దుల్  హమీద్.  అమృత ప్రభాకర్. యఫ్ టీవీ సిబ్బంది మంతెన శ్రీధర్. నారాయణ. సమ్మిండ్ల  ప్రకాష్. చిన్నాల శ్రీకాంత్. వంశీ. శేఖర్. రాకేష్. మోహన్ కృష్ణ. గిరి తో పాటు తదితరులు పాల్గొన్నారు