భువనగిరి టౌన్ (జనం సాక్షి):-
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహం ముందు ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి గారికి సూరత్ కోర్ట్ పరువు నష్ట కేసులో ఈరోజు రెండు సంవత్సరాల జైలు శిక్షను వేసిన విషయంలో పీసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మౌన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్టులో శిక్ష విధించడాని కోర్టును గౌరవిస్తూ కోర్టులోనే రాహుల్ గాంధీ నిర్దోషిగా నిరూపించడం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజాస్వామ్యవాదులను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి భయభ్రాంతులకు గురిచేసి వాళ్లను నొక్కి వేసే విధంగా చేస్తున్న చర్యలను భారత దేశ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని దేశంలో మాట్లాడితే నొక్కేసే ఆనాటి తెల్ల దొరల పాలన రజాకారుల పాలన రాజరికపాలను కొనసాగిస్తున్న దానిని ప్రజాస్వామ్య రీతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం బాటలో ఈ ప్రభుత్వాలను ఓటు ద్వారా కూల్చివేస్తామని రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య రీతిలో మీరు పోరాడండి మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారతదేశ ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల ముక్తకంఠంతో మీకు సంఘీభావంగా ఉంటామని అన్నారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ కౌన్సిలర్ కైరంకొండ వెంకటేష్ పడిగెల ప్రదీప్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల మనోజ్ దాసరి మధు జిట్ట మల్లారెడ్డి కాలియా నాగరాజు రత్నపురం సాయి పిట్టల శేఖర్ జానీ శివ శంకర్ నరసింహ మహేందర్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌన నిరసన దీక్ష రాహుల్ జి సంఘర్స్ కరో హమ్ తుమారా సాథ్ హై పోత్నక్..




