Tuesday, 3 November 2026

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

వేములవాడ రూరల్, మార్చి 29 (జనంసాక్షి) : సైబర్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కానిస్టేబుల్ రాజశేఖర్ విద్యార్థులకు వివరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూకలమర్రిలో బుధవారం వేములవాడ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అంబాసిడర్ ప్లాట్ ఫామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్లైన్ లో జరిగే మోసాలను, వాటి పట్ల అప్రమత్తంగా ఉండేలా ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలను చేశారు. అనంతరం యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి నాయక్, సైబర్ అంబాసిడర్ మెంటర్ టీచర్ అర్చన, అజయ్ కుమార్, సైబర్ అంబాసిడర్ విద్యార్థులు సహస్ర, ప్రవీణ్ కుమార్, జశ్వంత్, గ్రీష్మ, యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, సభ్యులు నవీన్, భూమేష్, వెంకటేష్, రాజ్ కుమార్ మరియు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.