రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మంచిర్యాల జోన్ రామకృష్ణ పూర్ లోని గ్రీన్ ఉడ్ స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై, ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై రామకృష్ణ పూర్ ఎస్.ఐ. అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ. అశోక్ మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు, ఉమెన్ సేఫ్టీ, పోలీస్, షీ టీమ్స్ మొదలగు అంశాల గురించి తెలిపారు. తాత్కాలిక ఆనందాల కోసం ప్రలోభాలకు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని, విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకొని, పట్టుదలతో కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. చదువు వలనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని బాగా చదివి, బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకుని, తల్లి దండ్రుల ఆశలు కూడా సిద్దించేలా కృషిచేయాలని విద్యార్థులను చైతన్య పరిచారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుట, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై అవగాహన కలిగి ఉండాలని, మి తల్లితండ్రులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలన్నీ ఉంచుకోవాలని అన్నారు.
ఈ సదస్సు లో కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలు, ఉమెన్ సేఫ్టీ పై అవగాహన సదస్సు -పట్టణ ఎస్.ఐ.అశోక్




