జహీరాబాద్ జులై 22 (జనంసాక్షి ) సోనియా గాంధీ పై ఈ డీ కేసు ఎత్తి వేయాలని కోరుతూ జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జె. గీతారెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీపై ఈడీ కేసులు వెంటనే ఎత్తివేయాలని టిపిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలనుసారం నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. సంపన్న కుటుంబం అయిన గాంధీ కుటుంబం దేశం కోసం దేశ ప్రజల కోసం ధన త్యాగం ప్రాణ త్యాగం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గంలో ని మండల ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీ అధ్యక్షులు,జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ చైర్మన్ లు,మాజీ కౌంస్లర్ లు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎస్సి ఎస్టీ బిసి ,మైనార్టీ, సెల్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్,ఎన్ ఎస్ యూ ఐ సేవాదల్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సోనియా గాంధీ పై ఈడీ కేసు ఎత్తి వేయాలి




