సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
మహబూబాబాద్-సెప్టెంబర్18 (జనంసాక్షి)
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 19వ తేదీ సోమవారం నాడు అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సోమవారం రోజు వివిధ ప్రాంతాల నుండి తమ ఫిర్యాదులను అందించేందుకు జిల్లా కేంద్రానికి చేరుకోరాదని కలెక్టర్ తెలిపారు.