Wednesday, 4 November 2026

సోమవారం ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం రద్దు

మహబూబాబాద్ బ్యూరో-జూలై17(జనంసాక్షి)

విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా సోమవారం ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా విజ్ఞప్తులను అందించటానికి కలెక్టరేట్ కు రావద్దని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి విధులు నిర్వహిస్తున్నారని, మండల, ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.