జనం సాక్షి /కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పల్లె ప్రకృతి వనం మందుబాబులకు అడ్డాగా మారిందని వొక పత్రికలో కథనం వచ్చింది.దీనికి స్పందించిన జిల్లా పంచాయితీ అధికారి సదరు గ్రామ పంచాయితీ కార్యదర్శి కి షోకాజ్ నోటీసు ఇచ్చారు.ఈ నోటీసు సదరు విలేఖరి తన వాట్సాప్ స్టేటస్ గా ఉంచోకొండం తో పాటు ఇతర వాట్సాప్ గ్రూప్ లలో పెట్టాడు.రహస్యం గా ఉంచాల్సిన షోకాజ్ నోటీసు ప్రైవేటు వ్యక్తికి అందడం చర్చనీయం గా మారింది
నోటీసు అందుకున్న పంచాయితీ కార్యదర్శి గిరిజన మహిళ అయేనందుననే జిల్లా పంచాయితీ అధికారి ప్రోద్బలం తో షోకాజ్ నోటీసు బహిర్గతం అయిందని .మహిళా అధికారికి వెంటనే న్యాయం చేయాలని దళిత,గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.




