Thursday, 5 November 2026

సౌదీలో హెలికాప్టర్‌ కూలి నలుగురు మృతి

హైదరాబాద్‌,జ‌నంసాక్షి: సౌదీ అరేబియాలో మిలిటరీ శిక్షణలో ఉన్న హెలికాప్టర్‌ కూలిపోవడంతో నలుగురు సిబ్బంది మృతిచెందినట్లు సౌదీఅరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాక్‌, కువైట్‌ సరిహద్దులో హాఫార్‌ అల్‌-బాటిన్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. హెలికాప్టర్‌ కూలిపోవడానికి దారితీసిన కారణాలు తెలియలేదు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *