స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థానిక సర్పంచ్ చింతల భాస్కర్
పెద్దవంగర అక్టోబర్ 10(జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధిని పనుల్లో దూసుకెళ్తుంది స్థానిక సర్పంచ్ చింతల భాస్కర్ అన్నారు. సోమవారం మండలో ని గంట్ల కుంట గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మూడు లక్షల రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణముకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ చింతల భాస్కర్ తరువాత మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని రంగాల లోని అభివృద్ధి చెందుతుందని విద్యార్థులకు ఎలాంటి ఆటంకుళ్ళు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ అశోక్,హెచ్ఎం శ్రీనివాసరావు,వార్డు ముత్తినేని సోమయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు