Wednesday, 4 November 2026

స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పట్టించుకోని పేరెంట్స్‌

ప్రమాదాలు జరిగాక బాధపడితే లాభం లేదు

హైదరాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): ప్రైవేట్‌ స్కేళ్లకు పిల్లలను పంపే తల్లిదండ్రులు తమ పిల్లలు జాగ్రత్తగా స్కూలుకు వెళ్లివచ్చేలా చూడాలని ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఎ అధికారులు సూచిస్తున్నారు. ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలతో ఆపటు, స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌ కూడా చూసుకోవాలన్నారు. బడి బస్సులు ఎంత వరకు ఫిట్‌గా ఉన్నాన్నది అడిగి తెలుసుకోవాలన్నారు.నిబంధనల ప్రకారం ఉన్నాయా..లేదా, అధికారులుఆ పాఠశాల బస్సులకు అనుమతిచ్చారా.. అనే విషయాలు తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా బస్సుల ఫిట్‌నెస్‌ పరిస్థితి తెలుసుకోవడంలో వెనుకబడిపోతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే అప్పుడు గుండెలు బాదుకుంటున్నారే తప్ప అసలు విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అధికారులు అంటున్నారు. అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ విషయాలు బయటపడుతున్నాయి. అధికారులతో పాటు తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యతగా తమ పిల్లలు ప్రయాణించే బస్సులను, నడిపే డ్రైవర్లను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉండాలన్నారు. ఎలాంటి తేడాలు గమనించినా వెంటనే పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతోపాటు ఆర్టీఏ అధికారులకు కూడా తమ సమస్యను తెలుపవచ్చన్నారు. . స్కూల్‌ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే అప్పుడు కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుంది. కు ఆర్టీఏ అధికారులు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ సర్టిఫికెట్లు జారీచేస్తారు. ఇకపోతే బస్సుల ఫిట్‌నెస్‌ రెవెన్యూల్‌ కోసం గడువు ఇచ్చినప్పటికీ కొంతమంది పాఠశాల బస్సుల యజమానులు ఫిట్‌నెస్‌ రెవెన్యూల్‌చేసుకోవడంలో అలసత్వం చూపిస్తున్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలు పున్ణప్రారంభం అయిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.పిల్లల భవిష్యత్‌ కోసం ఎప్పుడు పరితపించే తల్లిదండ్రులు స్కూల్‌ బస్సుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తమ పిల్లలను పాఠశాలకు తరలించే బస్సులు ఏ విధంగా ఉన్నాయి..? వాటిని నడిపే డ్రైవర్లు సక్రమంగా నడుపుతున్నారా..? లేదా..? అన్నది గమనించడం లేదు. ప్రధానంగా డ్రైవర్‌ం గురించి ఆరా తీయడం లేదని అధికారులు అంటున్నారు. తమ రూట్‌కు వచ్చే బస్సు డ్రైవర్‌ రోజు ఒక్కరే వస్తున్నారా..? లేదా మారుతున్నారా..? అనే అంశాన్ని కూడా గమనించాలన్నారు. ఎప్పుడూ ఒకే డ్రైవర్‌ బస్సు నడపడం వల్ల ఆ రూట్‌పై అతనికి పూర్తిగా అవగాహన ఉంటుందన్నారు. అయితే ఇలాంటి వివరాలను స్కూలు యజమాన్యాలతో చర్చించాలని అన్నారు.