*స్కూల్ సమస్యలు పరిష్కరించిన కౌన్సిలర్

వనపర్తి జులై   (జనం సాక్షి) బుధవారం బుడగ జంగాల కాలనీలో 8వ వార్డులో మండల ప్రాథమిక పాఠశాలకు వార్డుకౌన్సిలర్ విభూది నారాయణ వంట సామాగ్రిని, అలాగే వార్డులో ఉన్న స్కూళ్లకు అంగన్వాడి కి కరెంటు ఏర్పాటు, స్కూల్లో ఫ్యాన్లు ఫిట్టింగ్ చేయించారు. అదేవిధంగా శ్రీనివాసపురంలో ప్రాథమిక పాఠశాలకు కూడా పెయింటింగ్ మొదలగునవి చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయులు సురేందర్ గౌడ్,సిబ్బంది కౌన్సిలర్ కు శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె షఫీ టిఆర్ఎస్ నాయకులు సిరివాటి పెద్ద కురుమూర్తి, సిరివాటి శంకర్,సిరివాటి కృష్ణ, సిరివాటి మురళి, వనగంటి శంకరయ్య,అశ్వ వెంకటేష్, విభూది చంద్రయ్య,కడమంచి చంద్రమౌళి,సిరివాటి విజయ్, స్కూల్ కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు
Attachments area