*స్నేహమంటే ఇదేరా..*

వీపనగండ్ల ఆగస్టు 07 (జనంసాక్షి) స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, కుల మత భేదం చూడనిది పేద ధనిక భేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహమంటే ఇదేరా అని నిరూపించిన స్నేహితులు.అందుకే స్నేహమంటే ఇదేరా, వీపనగండ్ల మండల కేంద్రం లోని సంపత్ రావు పల్లి గ్రామానికి చెందిన ఎల్లస్వామి ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో అతని క్లాస్మేట్స్ అందరూ కలిసి పెంట్లవెల్లి మండల కేంద్రంలో 98, 99 బ్యాచ్ తో కలిసి అతనితో పాటు చదువుకున్న క్లాస్మేట్స్ అందరూ కలిసి ఆదివారం నాడు 60 వేల రూపాయలు జమ చేసి  మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరంతరం మహిళా సంఘాల సేవలో బుక్కిపరుగా పనిచేస్తూ సేవలందించే వారు,ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. స్నేహితుల రోజు కావడంతో స్నేహితులందరు కలిసి ఈ మంచి పనికి ఒడికట్టారు. స్నేహితుల పేర్లు చెప్పకపోవడం స్నేహానికే ఆదర్శం, స్నేహితుల  ఆదర్శానికి పలువురు అభినందించారు.