Tuesday, 3 November 2026

స్నేహితుడే కీచకుడైతే!

– ఇక అమ్మయిలకు రక్షణ ఎవరు?
హైదరాబాద్‌,జనంసాక్షి : మహిళలపై లైంగిక వేధింపులు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. స్నేహంగా ఉంటున్న వారు కూడా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నగరంలో చదువుతున్న నాగాలాండ్‌ విద్యార్థినిపై ఆఫ్గానిస్థాన్‌కు చెందిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగాలాండ్‌కు చెందిన విద్యార్థిని(23) హైదరాబాద్‌-తార్నాకలోని హనుమాన్‌నగర్‌లో నివాసముంటూ ఓ ప్రయివేటు కళాశాలలో ఎంఏ (అంగ్లం) చదువుతోంది. ఈమెకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ (ద్వితీయ) చదువుతున్న ఆఫ్గానిస్థాన్‌కు చెందిన నాయల్‌ యూసుఫ్‌ (21)తో పరిచయం ఏర్పడింది. బుధవారం హనుమాన్‌నగర్‌లోని విద్యార్థిని గది వద్దకు వచ్చిన యూసుఫ్‌ తన ద్విచక్ర వాహనంపై ఆమెను బలవంతంగా అంబర్‌పేటలోని తన గదికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి గురువారం వదిలేశాడు. బాధితురాలు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం యూసుఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *