స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు

మోత్కూరు సెప్టెంబర్ 23 జనం సాక్షి : మోత్కూరు కు చెందిన నిలిగొండ లక్ష్మయ్య ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన తోటి మోత్కూర్ జడ్పి హై స్కూల్ పదవ తరగతి బ్యాచ్ 2005-2006 స్నేహితులు, తమ వంతు సహాయంగా లక్ష్మయ్య కుటుంబానికి 30 వేల ఆర్థిక సహాయంగా అందజేశారు.