*స్పందన జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ.*

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్:జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్పందన జూనియర్ కళాశాలలో గురువారం ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులకు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా విద్యార్థులలో చిన్న పిల్లలలో జీర్ణ వ్యవస్థకు సంబంధించి రక్తహీనతకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని వీటి నివారణకు గాను ఆల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కట్ట ప్రవీణ్ కుమార్ రెడ్డి,అధ్యాపకులు ఉమారాణి,సైదిరెడ్డి,నగేష్,సతీష్, శ్రీధర్,ఆంజనేయులు,శ్రీనివాస్ చారి, పాల్గొన్నారు.