Monday, 2 November 2026

స్పీకర్‌ ను కలిసిన అసెంబ్లీ నూతన కార్యదర్శి వేదాంతం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అసెంబ్లీ నూతన కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యాలు స్పీకర్‌ మధుసుదనాచారిని కలిశారు. రాజా సదారాం స్థానంలో కొత్తగా నియమితులైన వేదాంతాన్ని ఈ సందర్భంగా స్పీకర్‌ అభినందించారు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న రాజా సదారాం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. రాజా సదారాం స్థానంలో వేదాంతం నర్సింహాచార్యాలును సీఎస్‌ ఎస్పీ సింగ్‌

నియమించారు.