హైదరాబాద్:ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసును విరమించుకోనుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైసీపీ నేతలతో మధ్యవర్తిత్వం నడిపారు. దీంతో స్పీకర్‌పై అవిశ్వాసం విషయంలో వైసీపీ వెనక్కు తగ్గింది. దీంతో ఏప్రిల్ 4వ తేదీన శాసనసభ సమావేశం లేనట్టేనని సమాచారం. కాసేపట్లో అసెంబ్లీలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.




