Tuesday, 3 November 2026

విజయవాడ సత్యనారాయణపురంలో ఉద్రిక్తత

విజయవాడ:సత్యనారాయణపురంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. భువనేశ్వరీ పీఠం ఆధీనంలోని సీతారామకళ్యాణ మండపాన్ని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆర్డర్ లేకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని పలు బ్రాహ్మణ సంఘాలు అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో పలువురు బ్రాహ్మణ సంఘాల నేత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్యే బొండా ఉమా ప్రోద్భలంతోనే మండపాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *