Tuesday, 3 November 2026

స్ఫూర్తి ప్రధాయని చాకలి ఐలమ్మ

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్…
ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు…
ములుగు బ్యూరో,సెప్టెంబర్26(జనం సాక్షి):-
తెలంగాణ సాయుధ పోరాటంలో వీర వనిత చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు,ప్రజాస్వామిక జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు.
ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సోమవారం చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్ర పటానికి తస్లీమా  పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం తస్లీమా మాట్లాడుతూ మహిళల చైతన్యానికి,ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీకగా ఐలమ్మ నిలుస్తుందని తస్లీమా అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ తెగువ,ధీరాత్వం,పోరాటతత్వం అందరికీ ఆదర్శమని తస్లీమా అన్నారు,
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది,మహిళలు,రిజిస్ట్రేషన్ దారులు,తదితరులు ఉన్నారు.
Attachments area