స్మార్ట్ సిటీలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి

మందు బాబులకు అడ్డాగా మారిన మున్సిపల్ పార్కింగ్ స్థలo
—–CPM నగర కార్యదర్శి గుడికందుల సత్యం
కరీంనగర్ టౌన్ ఆగస్టు 11(జనం సాక్షి)
స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కన గల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కింగ్ స్థలాలను సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ స్మార్ట్ సిటీ గా ఉన్న కరీంనగర్ లోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు కూరగాయల మార్కెట్ వీక్లీ మార్కెట్ రద్దీగల ప్రాంతాలలో కార్లు, బైకులు ఎక్కడ పార్కింగ్ చేయాలని ప్రశ్నించారు?
పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్ల పైన నిలిపిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చాలా అని వేస్తున్నారని క్రేన్ల ద్వారా వాహనాలను తీసుకెళ్తున్నారని పార్కింగ్ స్థలాలు చూపకుండా చాలా విధించడం సరైంది కాదని అన్నారు.
స్మార్ట్ సిటీ లో ఉన్న కరీంనగర్ లో ఎక్కడ చూసినా నో పార్కింగ్ నో పార్కింగ్ అని బోర్డులు పెడుతున్నారు అలా అయితే వాహదారులు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమర్షియల్ స్టేటస్ కింద పార్కింగ్ కోసం కేటాయించారని పార్కింగ్ కేటాయించిన స్థలాలు మందు బాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్కింగ్ స్థలంలో బీరు బాటిళ్లు మద్యం బాటిళ్లు కుక్కలు సైర్త విహారం చేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ నియర్ వెంటనే స్పందించి నగరంలో ప్రజలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు స్మార్ట్ సిటీ అంటే పేద ప్రజలను సామాన్యులపైన భారాలు వేయడమేనా? అని ప్రశ్నించారు.
స్మార్ట్ సిటీలో రద్దీ పెరిగిన రీత్యా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని నగరవాసులకు కలుషితం లేని తాగునీటి సౌకర్యం కల్పించాలని, నగరంలో పందులు కుక్కలు విచ్చలవిడిగా సైర్థవిహారం చేస్తున్నాయనిచేస్తున్నయని వెంటనే మున్సిపల్ కమిషనర్ నియర్ స్పందించి ప్రజలకు పార్కింగ్ స్థలాలతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్, నగర కమిటీ సభ్యులు జీ తిరుపతి, పి మురళి, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, కొంపెల్లి సాగర్, జి రవీందర్ నాయక్, గాజుల కనకరాజు పులిపాక సాయి శ్రీనివాస్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు