హైదరాబాద్,ఫిబ్రవరి17(జనంసాక్షి): సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతి చోట విజయం సాధించాలని ప్రతి ఫాస్టర్ కేసీఆర్‌ను ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఫాస్టర్స్‌కు ఏ సమస్య వచ్చినా సీఎం కేసీఆర్ అండగా ఉంటారని స్పష్టం చేశారు. ట్విన్ సిటీస్ ఫాస్టర్స్ సీఎం కేసీఆర్‌ను దీవించేందుకు వచ్చినందుకు కవిత వారికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా క్రిస్టియన్ భవన్‌ను నిర్మించిన ఘటన సీఎం కేసీఆర్‌ది అని నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.




