హైదరాబాద్,ఫిబ్రవరి17(జనంసాక్షి): టిఆర్‌ఎస్ ఎన్‌డిఎలో చేరడం ఖాయమైందన్న విమర్శలను విపక్షాలు తీవ్రం చేశాయి. కాం/-గరెస్, టిడిపిలు ఇప్పటికే కెసిఆర్‌పై విమర్శలు చేశారు. కెసిఆర్ ఢిల్లీ పర్యటన దీనికోసమేనని అన్నారు. తన ముద్దుల కూతురు కవితకు మంత్రి పదవి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని టీడీపీ నేత సతీష్‌మాదిగ ఆరోపించారు. కవితకు మంత్రి పదవి ఇస్తే కడియం శ్రీహరి అడ్డుపడతారని భావించి ఎంపీగా ఉన్న కడియంను రాష్ట్రమంత్రిని చేశారన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే పెన్షన్లు ఇస్తామని ప్రలోభ పెట్టడం సరికాదని సతీష్‌మాదిగ అన్నారు. ఇలాంటి వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇదిలావుంటే మోడీతో స్నేహం చేయడానికి కొందరు నేతలు రామోజీరావుతో మద్యవర్తిత్వం నడుపుతున్నారని సిపిఐ నేత కె.నారాయణ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మధ్యకాలంలో రామోజీరావును మెచ్చుకుంటున్న నేపధ్యంలో నారాయణ పరోక్షంగా ఈ ఆరోపణలు చేశారు. మోడీతో సన్నిహిత సంబందాల కోసం కెసిఆర్ పాకులాడుతున్నారని ఆయన అన్నారు. రెండు /ూష్టాల్ర ముఖ్యమంత్రులు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీ కరుణ తమపై ఉండాలని ప్రాధేయపడున్నారని ఆయన ద్వజమెత్తారు. ఇటీవలే ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన కేజీవ్రాల్ మాదిరే రాజకీయ హక్కుల కోసం పోరాటం చేయాలని అన్నారు. రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులు మోడీ వద్ద తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని నారాయణ విమర్శించారు.




