Thursday, 5 November 2026

స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ఫూర్తి ప్రధాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్

 కొండమల్లేపల్లి జనవరి 18 జనం సాక్షి న్యూస్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆరాధ్య దేవుడు,మరణం లేని కారణ జన్ముడు, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న కీ.శే.ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేతావత్ బిల్యా నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన నేత అని రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతినార్జించారన్నారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన మహానేత ఎన్టీఆర్ అని ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోతారన్నారు తెలుగు తెరకు మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని వెండితెరపై రాముడైనా కృష్ణుడైన మరే పాత్ర అయినా ఎన్టీఆర్ చేసిన ఆ పాత్రకు నిండుదనం వచ్చేదని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారని నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎవరికి సాధ్యం కానీ రికార్డులను సృష్టించాలన్నారు కొన్ని వేల మందికి రాజకీయ బిక్ష ప్రసాదించారన్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలపరంగా అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆర్, చంద్రబాబు అని తెలిపారు ఈ కార్యక్రమంలో గాజుల మురళి అమరేందర్ రెడ్డి గార్లపాటి శ్రీనివాస్ గార్లపాటి బాలకృష్ణ కండే సత్యం మహేందర్ యాదవ్ నీలా సుమన్ హరిలాల్ సీతారాం భాస్కర్ జైపాల్ నాయక్ నాగార్జున నాయక్ తదితరులు పాల్గొన్నారు