*స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం*
నేత్రదానంతో మరొకరికి జీవితం.
కోదాడ. ఆగస్టు,6(జనం సాక్షి)
నేత్రదానం చేయడంతో మరొకరికి జీవితం ఇచ్చిన వారము అవుతామని స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో పైడిమర్రి రామారావు అనారోగ్యంతో ఈరోజు ఉదయం మృతి చెందగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ వారు వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఖమ్మం నేత్రనిధి వారిని సంప్రదించి నేత్రాలను అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేత్రదానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని తమ తదనంతరం మరొకరికి చూపునిచ్చేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి యాదా సుధాకర్, పైడిమర్రి వెంకటనారాయణ, పైడిమర్రి నారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.