*స్వార్థ ప్రయోజనాలకే ఎన్ హెచ్ 563 అలైన్ మెంట్ మార్పు*..
ఎల్కతుర్తి మండలం జనం సాక్షి 22/09/2022
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కరీంనగర్* *లోని ప్రతిమ కాలేజ్ వద్ద ఎన్ హెచ్ 563 రోడ్డు అలైన్ మెంట్ మార్చారని హుస్నాబాద్ టీ పీసీసీ* *సభ్యుడు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి ఆరోపించారు. ఎల్కతుర్తిలో గురువారం మాట్లాడారు. గతంలో నిర్ణయించిన అలైన్ మెంట్ ను వదిలి కరీంనగర్* *మీదుగా ఇరుకుళ్ల రోడ్ – రామగుండం బైపాస్ రోడ్ గుండా జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. సమావేశంలో* *కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ, మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, పాక రమేష్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు*.