హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్

    – కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ  హుజూర్ నగర్ ఆగస్టు 17 (జనం సాక్షి): హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాది విజయ్ రెడ్డి హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో బుధవారం కూడా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ  విధుల బహిష్కరణ కార్యక్రమం గురువారం కూడా కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జ్ సి.హెచ్.ఎ.ఎన్. మూర్తి, జూనియర్ సివిల్ జడ్జ్ సంకేత్ మిత్ర లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, రమణారెడ్డి, వట్టికూటి అంజయ్య, లతీఫ్, రాఘవరావు, కమతం నాగార్జున, కొట్టు సురేష్, పిడమర్తి చంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, సురేష్ నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, పాలేటి శ్రీనివాసరావు, గొట్టే ప్రశాంత్, సైదా హుస్సేన్, పసుపులేటి వీరయ్య, కూరపాటి శ్రీను, శ్రీను నాయక్, మహిళా న్యాయవాది సుంకరి ప్రదీప్తి తదితరులు పాల్గొన్నారు.