హచ్చు నాయక్ మృతి టిఆర్ఎస్ పార్టీ కి తీరని లోటు: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
గరిడేపల్లి, సెప్టెంబర్ 3 (జనం సాక్షి):తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రైతు సమన్వయ సమితి సభ్యుడు గుగులోతు హచ్చు నాయక్ మృతి బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం గారకుంటతండా గ్రామంలో ఆయన నివాసానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సిపిఎం పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరి టీఆర్ఎస్ పార్టీ బలోపితం కొరకు అనేక కార్యక్రమాలు చేశాడని ఆనాటి జిల్లా అధ్యక్షులు తిప్పన విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు చేశాడని అన్నారు. వారి వెంట హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి ,కేఎల్ఎన్ రెడ్డి , వీరంరెడ్డి శంబిరెడ్డి , స్థానిక సర్పంచ్ బాబు నాయక్ ,మాజీ సర్పంచ్ బానోత్ వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైదా నాయక్, సందీప్ నాయక్, లకపతి నాయక్, నరేందర్ నాయక్ ,రవీందర్ నాయక్, వెంకట్రాం నాయక్, షాంపు నాయక్ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.