హత్యకు గురైన అశోక్ కి ఘన నివాళులు
టేకులపల్లి డిసెంబర్ 22 (జనం సాక్షి): ఇటీవల అతి దారుణంగా హత్యకు గురైన బిజెపి మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ కుమారుడు అశోక్ గురువారం మండల పరిధిలోని శాంతినగర్ వారి స్వగృహంలో జరిగిన దశదినకర్మలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున సంస్మరణ సభకు హాజరై పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హతీరామ్ నాయక్ & టీం, బీజేపీ మాజి జిల్లా అధ్యక్షులు I కేర్ బోర్డ్ మెంబెర్ బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి, టేకులపల్లి ఎస్సై భూక్య శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి భూక్యా. సీతారామ్ నాయక్, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు, సర్పంచులు మాలోతు సురేందర్ నాయక్, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, పి ఆర్ కాలే, భాస్కర్ నాయక్, హరిలాల్ నాయక్, రాంచందర్ నాయక్, శ్రీను నాయక్, గోపిక్రిష్ణ,సంజీవ రెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బొమ్మల వరప్రసాద్ గౌడ్, అజ్మీర శివ, సర్పంచ్ జగదీష్ తదితరులు పాలుగోన్నారు.




