హత్య కేసులో ఒక వ్యక్తి రిమాండ్

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్14,( జనం సాక్షి ) :
హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు  సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగబోయిన యాదగిరి తన భార్య అయినటువంటి లింగబో యిన సరితపై ఈనెల 3 న రాత్రి కుటుంబ కలహా లతో గొడ్డలితో దాడిచేసి తలపైన  కొట్టడం జరిగిం దని గాయాలైనటువంటి లింగబోయిన సరితను వారి పెద్ద కుమారుడైన లింగబోయిన నవీన్ ఎంజీ ఎం హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగిందన్నా రు. కొడుకు లింగబోయిన నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దరఖాస్తు స్వీకరించి కేసు నమోదు చేయ డం జరిగిందని, ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లింగబోయిన సరిత 13 తేది  హాస్పి టల్ లో చనిపోయిందని, తలకు బలమైన గాయా లు కావడంతో ఇట్టి మరణానికి కారణమైన లింగ బోయిన యాదగిరిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందనిసీఐశ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ  శ్రావణ్ కుమార్,ఏఎస్ఐ రాజమౌళి, స్టేషన్ రైటర్ శ్రీనివాస రావు,కానిస్టేబుల్ కుమార్,మోహన్, పాల్గొన్నారు.