హత్య సంఘటన కేసును ఛేదించిన చింతపల్లి పోలీసులు..

 

చింతపల్లి. ఫిబ్రవరి 15 (జనంసాక్షి) చింతపల్లి మండలం బూసిబంధ గ్రామ సమీపంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి సీదరి పెంటయ్య ,సీన్దేరి నగేష్ అనే ఇరువురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని చింతపల్లి సిఐ టి. శ్రీను తెలిపారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీన చింతపల్లి మండలం కిటు ముల పంచాయతీ బూసిబంధ గ్రామానికి చెందిన పాంగి సుమతి అనే గిరిజనుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పై మృతిని భార్య డిప్పల రాసు ఇచ్చిన ఫీర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. పాత కక్షల నేపథ్యంలో నే పెంటయ్య, నగేష్ లు ఇరువురు మాటువేసి నాటు తుపాకి తో కాల్చి క్రింద పడిన అనంతరం కత్తి తో పొడిచి చంపారని సి ఐ తెలిపారు. ఈ మేరకు ఇరువురి పై కేసు నమోదు చేసి నిందితులను రిమాండు కు తరలించడం జరిగిందని సిఐ శ్రీను తెలిపారు. ఈసమావేశంలో ఎస్ ఐ మహ్మద్ షరీఫ్ అలీ సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు