ఏటూరునాగారం(జనం సాక్షి),మే14.ఏటూరునాగారం మండలం కేంద్రంలోని క్రాస్ రోడ్డు లో గల భక్తఆంజనేయ స్వామి,ఓడవాడ లోగల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలకు హనుమజ్జయంతి సందర్భంగా ఆలయ కమిటీలు ఆలయాలను ఒకరోజు ముందునుండే విద్యుత్ దీపాల అలంకరణ,మామిడి తోరణాలతో ముస్తాబు చేసినారు. ఆదివారం ఉదయం నుండి గ్రామస్తులు, మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.ఓడవాడలో అర్చకులు సందీప్, పాపన్న గురు స్వామి,కమిటీ ఆధ్వర్యంలో, క్రాస్ రోడ్డు నందు గల ఆలయంలో ఎల్లాప్రగడ సూర్య నారాయణ శర్మ, మణిశర్మ, రామ్మూర్తి శర్మ ,కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.మధ్యాహ్నం ఆయా దేవాలయాల్లో అన్నదానాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి రెండు చోట్లా సుమారుగా 2000 మందికి పైగా భక్తులు విచ్చేసి స్వీకరించారు.




