Thursday, 5 November 2026

హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. 

– ఇద్దరు మహిళలు మృతి
హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నగర పరిధిలోని హయత్‌నగర్‌ భాగ్యలత కాలనీ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గుర్తుతెలియని మహిళలు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న మహిళలను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లారీ రోడ్డు దాటుతోన్న మహిళలను ఢీకొట్టి టైర్లు వారి తలపై నుంచి వెళ్లడంతో మృతి చెందారు. నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ రోడ్డు దాటుతున్న వారిని డ్రైవర్‌ గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.