టీడీపీ తీరు ‘గజనీ’ సినిమాను తలపిస్తుంది

– బీజేపీతో సమానంగా టీడీపీ ఏపీ ప్రజలను మోసం చేసింది
– ట్విట్‌లతో టీడీపీని విమర్శించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
అమరావతి, జులై21(జ‌నం సాక్షి) : లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు దేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గజిని సినిమాలో హీరోలా టీడీపీ కన్వినియెంట్‌ మెమొరీ లాస్‌ సిండ్రోమ్‌తో బాధపడుతోందంటూ జనసేనాని ఎద్దేవా చేశారు. జనసేన అనుకూల రాజకీయాలు చేయదు, ఏదో సరైందో అదే చేస్తుందని పవన్‌ ట్వీట్‌ చేశారు. ప్రత్యేక ¬దా డిమాండ్‌ను బలహీన పరిచిందెవరు? బీజేపీతో కుమ్మక్కయిందెవరు? టీడీపీ ఓసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడాలని సూచించారు. రేపటి రోజున విూ సౌలభ్యాన్ని బట్టి విూరు మళ్లీ మాట మార్చరని హావిూ ఇవ్వగలరా? అంటూ జనసేనాని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. ‘ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అంటున్నారు. దీన్ని బట్టి టీడీపీ-బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుందని పవన్‌ అన్నారు. ఇద్దరు కలిసి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తోందని పవన్‌ ట్వీట్‌ చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ఇప్పుడే పుట్టిన పాలుగారే పసి పిల్లలలాగా.. కేంద్రం చేత మోసగింపబడ్డాం.. అంటే, ప్రజలు నమ్ముతారని టీడీపీ నాయకులు ఎలా
అనుకుంటారని జనసేనాని ప్రశ్నించారు. బీజేపీకి నష్టం కలగకూడదని జనసేన ట్వీట్లు చేస్తోందన్న సీఎం వ్యాఖ్యలపై పవన్‌ మండిపడ్డారు. ‘ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీని వెనకేసుకు రావడం వల్ల మాకు వచ్చే లాభమేంటి ప్రశ్నించిన పవన్‌..  ఏపీ ప్రజలు బీజేపీని పూర్తిగా వదిలేశారన్నారు. ఆ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అంటూ పవన్‌ ప్రశ్నించారు. బీజేపీతో సమానంగా టీడీపీ కూడా అంతే దారుణంగా ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసిందనేదే నా ట్వీట్ల వెనుక ముఖ్య ఉద్దేశం అని పవన్‌ స్పష్టం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్‌పై పవన్‌ సెటైర్లు పేల్చారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఫోటోను ఉంచారు. గజిని చిత్రంలో హీరోలాగా టీడీపీ వాళ్లకి రోజు రోజుకీ పెరిగిపోతోందన్నారు.

తాజావార్తలు