హైదరాబాద్,జూలై27(జనం సాక్షి): హరితహారం, పరిశుభ్రతలో వీవోఏలు భాగస్వామ్యం కావాలని పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.సాగర్ రింగ్ రోడ్డు వద్ద కళ్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్లో వీవోఏల సంఘం 2వ మహాసభలో ఇవాళ జరిగాయి. ఈ సభల్లో పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మహిళలను సంఘటితం చేసేందుకు వీవోఏలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీవోఏలకు రూ. 3 వేల గౌరవ వేతనం ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. గ్రామైక్య సంఘాల ఆదాయాన్ని పెంచేలా వీవోఏలు కృషి చేయాలి. ఆదాయం పెరిగితే మరో రూ. 2 వేలు కూడా పొందే అవకాశం ఉంటుందని జూపల్లి చెప్పారు.




