నారా లోకేశ్‌తో కైనెటిక్‌ గ్రీన్‌ కంపెనీ బృందం భేటీ

విజయవాడ,జూలై27(జ‌నం సాక్షి): మంత్రి నారా లోకేశ్‌ తో శుక్రవారం కైనెటిక్‌ గ్రీన్‌ కంపెనీ బృందం సమావేశమయ్యింది. కంపెనీ బృందం మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముందుందన్నారు. అనంతరం కంపెనీ సిఇఒ విూడియాతో మాట్లాడుతూ.. ఎపిలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. ఎపిలో పరిశ్రమలకు అనుమతులు పొందడం సులభమని తెలిపారు. పారిశ్రామిక అభివఅద్ధికి ఎపి ప్రభుత్వం చేపట్టిన చర్యలు భేష్‌ అని కొనియాడారు. త్వరలోనే పూర్తి ప్రణాళికతో ఆంధప్రదేశ్‌కు వస్తామని కైనెటిక్‌ గ్రీన్‌ కంపెనీ సిఇఒ పేర్కొన్నారు.

 

తాజావార్తలు