హరితహారం చెట్లను నరికించిన ఆస్పత్రి సిబ్బంది

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతుంటే నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి సిబ్బంది చెట్లను నరికించి అమ్మకానికి పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పది సంవత్సరాల క్రితం నాటిన చెట్లను సిబ్బంది ఎలాంటి అనుమతి లేకుండా చెట్లను నరికించి అమ్మకానికి పెట్టడం విచారకరమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెట్లను పెంచాల్సిన సిబ్బంది చెట్లను నరికించి అమ్మకానికి పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అనుమతి లేకుండా చెట్లను నరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో మెడికల్ ఆఫీసర్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

తాజావార్తలు