Tuesday, 3 November 2026

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు 

సంగారెడ్డి,జనవరి23(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు జిల్లాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అటవీ పర్యావరణ శాఖ ఆధికారులను ఆదేశించింది. హరితహారం కింద జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేదన్నారు. నాటినమొక్కలను తప్పకుండా సంరక్షించాలన్నారు.  వర్షాలు లేనందున ఎండ తీవ్రత ఉన్నందున నాటిన వాటిని నీటిని అందించేందుకు  అలాగె మొక్క చుట్టూ ఫెన్సింగ్‌ చేసి సంరక్షంచే చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు వందశాతం మొక్కలు నాటి బాధ్యతను పూర్తి చేశామన్నారు.