హరితహారం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి. ఎంపీడీవో ఎస్ కుమార్.

తొర్రూర్  అక్టోబర్ 15.(జనంసాక్షి )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని లేనియెడల సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎస్.కుమార్ అన్నారు. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో రోడ్డుకు ఇరు ప్రక్కల నాటిన మొక్కలను పరిశీలించిన అనంతరం సంబంధిత కూలీలు నాటిన మొక్కలకు ముళ్ల కంపలతో ఫెన్సింగ్ వేస్తున్న తీరును చూసి అభినందించిన అనంతరం  ఎంపీడీవో మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, మొక్కలను సంరక్షించుకోవడం కోసం వన సేవకులను వెంటనే నియమించుకొని ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత గ్రామపంచాయతీలపై ఉందని మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.