Tuesday, 3 November 2026

హరిత హారం అందరి బాధ్యత

:సుదర్శన్ :శామీ ర్ పేట్, జనంసాక్షి : హరిత హారం హారంలో ప్రతి ఒక్కరూ బాగా స్వాములై పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ అన్నారు. శుక్ర వారం శామీర్ పేట్ ఎస్సి కాలనీలోని పోచమ్మ గుడి ఆవరణలో కట్టమైసమ్మ టెంపుల్ మెంబర్ కొమ్ము వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో కట్ట మైసమ్మ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, కుమార్,ఉప సర్పంచ్ రమేష్ యాదవ్, గ్రామ అధ్యక్షుడు రవి, వార్డు సభ్యులు మురళి, శ్రీకాంత్, ఉప్పలయ్య, నాయకులు డేవిడ్, మల్లేష్, సురేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
29ఎస్పీటీ -2:మొక్కలు నాటుతున్న నాయకులు