హరిత హారం చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా..
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి) నిబంధనలకు విరుద్ధంగా హరితహారంలో నాటిన చెట్టు నరికిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే …సిద్దిపేటలోని శుబాష్ నగర్ లో కోటిలింగాల గుడి దగ్గర 10 వ వార్డ్ లోని చంద్రమౌళి అనే వ్యక్తి హరితహారంలో నాటిన చెట్లను నిబంధనలు విరుద్ధంగా నరికి వేయడంతో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స,మున్సిపల్ కమీషనర్ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు రు.10 వేల జరినామ విధించినట్లు హరితహారం అధికారి సామల్ల అయిల్లయ్య పేర్కొన్నారు. మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటను హరితవనంగా మార్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు చెట్లు నరికిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10 వ వార్డ్ కౌన్సిలర్ బింగి బాలక్ష్మి, రాజేశం,సాయన్న,సుందర్ యాదగిరి,మధు,సుధన్ రెడ్డి,శివ కృష్ణ,మధు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.