జనం సాక్షి
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెల్దుర్తి మండలంలోని హల్దీ వాగులో భారీ నీరు వచ్చి చేరుకుంది దీంతో రైతన్నలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాసాయిపేట మండలంలోని హకీంపేట్ గ్రామ శివారులో ఉన్న హల్దీ ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరుకుంది ఇలాగే వర్షాలు కురిస్తే త్వరలోనే హకీంపేట్ డ్యాం మత్తడిదుంకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు ఈ వానలతో వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి మండలంలో ఉన్న అన్ని చర్లలో ఓ మోస్తారు నుంచి భారీగా వరద నీరు రావడంతో చెరువులన్నీ జలకల సంతరించుకుంటున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకూడదని పురాతన ఇళ్లల్లో ఉన్న వారంతా జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు తెలుపుతున్నారు
Attachments area




