20న జరిగే విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి

స్టూడెంట్ బ్లాక్ డివిజన్ అధ్యక్షుడు అత్కూరి కనకయ్య
(జనంసాక్షి) జులై 13 : ఈనెల 20న జరిగే విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ సిద్దిపేట డివిజన్ అధ్యక్షుడు అత్కూరి కనకయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలల గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించక పోవడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. శితిలావస్థలో ఉన్న పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని,విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధనకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చా